బెంజ్ ఈ-ప్లస్ కొనేసిన నటి లహరి
on Jul 8, 2024
బుల్లితెర సెలబ్రిటీస్ కి కొంచెం పేరు డబ్బు రాగానే ముందుగా వాళ్ళు చేసే పని కారు, ఇల్లు కొనడం. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని వైపులా నుంచి సంపాదన ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. బిజినెస్ లు, యూట్యూబ్ అమౌంట్, షోస్, ఈవెంట్స్, సీరియల్స్, మూవీస్ లో సైడ్ రోల్స్ ఇలా చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తూ అన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నటి ‘లహరి’ కూడా ఈ కోవలోకి వచ్చేసింది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
మొగలిరేకులు సీరియల్ లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కూడా నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ అమ్మడు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి లహరి ఇప్పుడు కొన్ని సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ ఉంది. బెంజ్ ఈ-క్లాస్ కారు కొనేసింది. ఇప్పుడు ఆ కార్ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది. ఆ కారు ధర మార్కెట్లో రూ.80 లక్షలకు పైనే ఉంది. నెటిజన్స్ లహరికి కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ పిక్స్ లో లహరి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తోంది. లహరి భర్త, బిడ్డ, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు.